Published on May 2, 2025
Current Affairs
భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం
భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం మధ్య ఉండొచ్చని డెలాయిట్‌ అంచనా వేసింది. బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను ఉపశమనంతో దేశీయ గిరాకీ పుంజుకోవచ్చని, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులను తట్టుకోవచ్చని తన ‘ఇండియా ఎకానమీ ఔట్‌లుక్‌’లో అభిప్రాయపడింది. 2024-25లో జీడీపీ వృద్ధి 6.3-6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.