భారత్-చైనా దేశాలు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి 2024, అక్టోబరు 21న కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
దీంతో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
ఒప్పందం ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. రెండు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.