ప్రపంచవ్యాప్తంగా 60 శాతం పర్యాటక ఉద్గారాల పెంపుదలకు భారత్, చైనా, అమెరికా దేశాలు కారణమవుతున్నాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
2009 నుంచి 2019 మధ్య పదేళ్ల కాలవ్యవధితో జరిపిన ఈ అధ్యయనం అత్యధిక జనాభా, రవాణాపరంగా ఎక్కువ డిమాండు ఉన్న దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.
గత దశాబ్దకాలంలో చైనా దేశీయ పర్యాటక వ్యయం ఏడాదికి 17 శాతం చొప్పున పెరిగింది. తద్వారా ప్రపంచ ఉద్గారాలను 0.4 గిగా టన్నుల మేర చైనా పెంచింది.
అమెరికా దేశీయ పర్యాటకం 0.2 గిగా టన్నులు, భారత్ 0.1 గిగా టన్నుల మేర ప్రపంచ ఉద్గారాలను పెంచినట్లు అధ్యయనం వెల్లడించింది.