Published on Nov 19, 2024
Current Affairs
భారత కాగ్‌గా కొండ్రు సంజయ్‌మూర్తి
భారత కాగ్‌గా కొండ్రు సంజయ్‌మూర్తి

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను 15వ కాగ్‌గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ 2024, నవంబరు 18న పేర్కొంది.

ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్‌మూర్తికి అవకాశం కల్పించారు.

ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి రికార్డులకెక్కారు.

ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది.