భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), బెంగళూరు కాంప్లెక్స్‌లోని నెట్‌వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 05 (UR-03, OBC-01, SC-01).
అర్హత: కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో బి.ఇ/ బి.టెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. దీంతో పాటు నిర్దేశిత ఐటీ (IT) సర్టిఫికేషన్లలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి.
అనుభవం: 01.02.2026 నాటికి కనీసం 4 ఏళ్ల సంబంధిత పారిశ్రామిక అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.02.2026 నాటికి గరిష్ఠంగా 32 ఏళ్లు మించకూడదు (నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
వేతనం: నెలకు రూ.50,000 - రూ.1,60,000 పే స్కేల్‌తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఏడాదికి సుమారు రూ. 16 లక్షల సీటీసీ (CTC) లభిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
దరఖాస్తు ఫీజు: రూ. 600 + 18% జీఎస్టీ. ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwBD), ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: మార్చి 10, 2026.
చివరి తేదీ: మార్చి 30, 2026.