భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 20
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.40,000 - రూ.55,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబరు 13.