ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) చెన్నై యూనిట్ వివిధ విభాగల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 84
వివరాలు:
1. డిప్లొమా అప్రెంటిస్: 10
2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 74
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్, బీకామ్/బీబీఏ/బీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 01-01-2026వ తేదీ నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,500.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 5, 6, 7.