Published on Sep 4, 2025
Current Affairs
భారత్, ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం 1 నుంచి అమల్లోకి
భారత్, ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం 1 నుంచి అమల్లోకి

నాలుగు ఐరోపా దేశాల కూటమి అయిన ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ), భారత్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2025, అక్టోబరు 1 నుంచి అమలు కానున్నట్లు స్విట్జర్లాండ్‌ తెలిపింది. ఈ ఒప్పందంపై సంతకాలు 2024 మార్చి 10న జరిగాయి. ఈ ఒప్పందం వల్ల మన దేశంలోకి 15 సంవత్సరాల్లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.