భారత్, ఆస్ట్రేలియా సైనికదళాల ఉమ్మడి సైనిక విన్యాసాలు 2024, నవంబరు 8న పుణెలో ప్రారంభమయ్యాయి. పట్టణ, అటవీ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఆపరేషన్ల నిర్వహణలో ఇరు పక్షాల మధ్య సహకారం, సమన్వయం పెంపొందించుకోవడం దీని ఉద్దేశం. ‘ఆస్ట్రాహింద్’ పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించడం ఇది మూడోసారి.
ఈ విన్యాసాల్లో భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్‌కు చెందిన 140 మంది, వాయుసేనకు చెందిన 14 మంది పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియా తరఫున 120 మంది సైనిక సిబ్బంది భాగస్వామ్యమయ్యారు.