ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధిని నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ఏజెన్సీ ఈవై అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నా.. చమురు ధరలు తక్కువగా ఉండడంతో, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గి, దేశీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఈవై విడుదల చేసిన ‘ఈవై ఎకానమీ వాచ్’ నివేదిక ఈ విషయాలు పేర్కొంది.