రీఛార్జిబుల్ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పరం సహకరించుకొనే విషయమై భారత్, అర్జెంటీనాలు అవగాహనకు వచ్చాయి.
దీనికి సంబంధించి భారత ప్రభుత్వ రంగ సంస్థ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, కెటమార్కా ప్రొవెన్షియల్ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య 2025, ఫిబ్రవరి 19న దిల్లీలో ఒప్పందం కుదిరింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, అర్జెంటీనాలోని కెటమార్కా గవర్నర్ రౌల్ అలెజాండ్రోజలీల్‌ల సమక్షంలో ఇది జరిగింది.