Published on Dec 9, 2025
Current Affairs
భారత అంతరిక్ష రంగం
భారత అంతరిక్ష రంగం
  • భారత అంతరిక్ష రంగ వ్యాపారం రాబోయే 8-10 ఏళ్లలో సుమారు రూ.4 లక్షల కోట్ల (45 బిలియన్‌ డాలర్ల)కు చేరొచ్చని భారత అంతరిక్ష కార్యకలాపాల శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్‌ పేరుతో ఒక అంతరిక్ష కేంద్రం (స్పేస్‌ స్టేషన్‌) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్‌ అవతరించేందుకు, ప్రైవేట్‌ పెట్టుబడుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది తెలిపారు.
  • దశాబ్ద కాలంలో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష విపణిలో 8-10% మార్కెట్‌ వాటా సాధించాలని భారత్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఇది 2 శాతంగా ఉంది.