భారత్‌లో గడచిన 8 సంవత్సరాల్లో క్షయ వ్యాధి కేసుల్లో 17.7% తగ్గుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2015లో లక్ష మందిలో 237గా ఉన్న క్షయ వ్యాధి కేసులు 2023 నాటికి 195కు తగ్గాయని డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన నివేదికను 2024, నవంబరు 2న ఆరోగ్యశాఖ అధికారులు దిల్లీలో విడుదల చేశారు. ప్రపంచ క్షీణత 8.3% కంటే భారత్‌లోనే తగ్గుదల అధికమని వెల్లడించారు.