Published on Dec 23, 2024
Current Affairs
భారత్‌లో షూటింగ్‌ ప్రపంచకప్‌
భారత్‌లో షూటింగ్‌ ప్రపంచకప్‌

2025లో జరిగే జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ దక్కించుకుంది.

రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 2025 సెప్టెంబరు-అక్టోబరు లేదా అక్టోబరు-నవంబరులో ఈ టోర్నీ నిర్వహించే అవకాశముంది.

గత దశాబ్ద కాలంలో భారత్‌లో నిర్వహించే తొమ్మిదో అత్యున్నత స్థాయి షూటింగ్‌ టోర్నీ ఇది. 

ఇటీవల కాలంలో అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) టోర్నీలకు మన దేశం తరచుగా ఆతిథ్యమిస్తోంది.

2023లో భోపాల్‌లో ప్రపంచకప్‌ జరగగా, ఇటీవల ప్రపంచకప్‌ ఫైనల్‌ పోటీలకు దిల్లీ వేదికగా నిలిచింది.