భారతదేశంలో భూతాపాన్ని పెంచే వాయువుల ఉద్గారాలు 2020లో అంతకు పూర్వం సంవత్సరంతో పోలిస్తే 7.93 శాతం మేరకు తగ్గాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు విభాగానికి సమర్పించిన ఒక నివేదికలో భారత్ తెలిపింది.
అలాంటి ఉద్గారాలు 2005-2020 మధ్యకాలంలో స్థూలంగా 36 శాతం పడిపోయాయని అందులో వివరించింది.
2019తో పోలిస్తే ఉద్గారాలు 7.93 శాతం తగ్గినా, 1994 నుంచి చూస్తే 98.34 శాతం మేర పెరిగాయని నివేదిక పేర్కొంది.
వర్ధమాన దేశాలు రెండేళ్లకోసారి ఈ నివేదికను ఐరాస విభాగానికి సమర్పించాల్సి ఉంది.