- పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉందనే విశ్లేషనలు వినిపిస్తున్నాయి. కెప్లర్ గణాంకాల ప్రకారం.. మన దేశం దగ్గర వాణిజ్య ముడిచమురు నిల్వలు దాదాపు 100 మిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. ఇందుకు అదనంగా మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో దాదాపు 39 మి.బ్యారెళ్లు ఉంది.
- భౌగోళిక - రాజకీయ ఒడుదొడుకులు ఎదురైనప్పుడు ఇంధన అవసరాలను తీర్చడానికి దేశంలోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు సరిపోతాయని గతంలో కేంద్ర చమురు మంత్రి హర్దిప్ సింగ్ పురి ప్రకటించారు.