- పోషకాహారం కొరవడటంతో ఎదుగుదల లేక అయిదేళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో, కాంగో మూడో స్థానంలో ఉన్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. బరువు తక్కువగా ఉండటం, కృశించిపోవడం, ఎదుగుదల లేక గిడసబారిపోవడం లాంటి రుగ్మతలు నీళ్ల విరేచనాలకూ, శ్వాసకోశ సమస్యలకు, మలేరియా, పొంగు వంటి వ్యాధులకు దారితీస్తాయి.
- ప్రపంచంలో 2023లో ఎదుగుదల కొరవడి అయిదేళ్లలోపే మరణించిన బాలల సంఖ్య 10 లక్షలైతే, వాటిలో 1,88,000 మరణాలతో నైజీరియా, లక్ష మరణాలతో భారత్, 50,000 మరణాలతో డెమోకటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు మొదటి మూడు స్థానాలను ఆక్రమిస్తున్నాయి.