భారత్‌కు తదుపరి రాయబారిగా తన సన్నిహితుడు సెర్గియో గోర్‌ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025, ఆగస్టు 23న వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైట్ హౌస్‌లో ట్రంప్‌నకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రత్యేక రాయబారి హోదాలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలనూ గోర్ పర్యవేక్షిస్తారని ట్రంప్ ప్రకటించారు.