2025లో మొత్తం మీద మన దేశంలోకి 47 బి. డాలర్ల (రూ.4.32 లక్షల కోట్ల) విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తరలివచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐ కంటే ఇవి 73% అధికం. సేవలు, తయారీలోకి ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చాయని, ఇందుకు భారత విధానాలు మద్దతుగా నిలిచాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ‘ద గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్ మానిటర్’ పేరిట యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం..
అంతర్జాతీయ ఎఫ్‌డీఐ 14% వృద్ధితో 1.6 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.147 లక్షల కోట్ల) కు చేరింది. చైనాలోకి వరుసగా మూడో ఏడాదీ ఎఫ్‌డీఐలు తగ్గాయి. 2025లో 8% క్షీణతతో 107.5 బి. డాలర్లకు పరిమితమయ్యాయి.