భారతీయ సంస్కృతి, వారసత్వ ప్రతీకైన భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కింది. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025, ఏప్రిల్ 18న యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది. భగవద్గీత, నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన 74 వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించినట్లు పేర్కొంది. దీంతో మొత్తం సేకరణల సంఖ్య 570కి చేరింది. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి.