Published on Apr 3, 2025
Current Affairs
భారత్‌పై ప్రతీకార సుంకం 26%
భారత్‌పై ప్రతీకార సుంకం 26%

ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2025, ఏప్రిల్‌ 2న వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ రోజ్‌గార్డెన్‌లో తన క్యాబినెట్‌ సహచరుల సమక్షంలో ట్రంప్‌ వివిధ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలను వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేశారు.