Published on Apr 15, 2025
Current Affairs
భూభారతి చట్టం
భూభారతి చట్టం

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం భూభారతి-2025 ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలు చేసే పైలట్‌ మండలాలుగా నాలుగింటిని ప్రభుత్వం ప్రకటించింది. నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ములుగు జిల్లా వెంకటాపూర్, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలాల్లో భూ భారతి అమల్లోకి వస్తుంది. ఏప్రిల్‌ 17 నుంచి ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరిస్తారు. మే 1 నుంచి మిగిలిన 29 జిల్లాల్లోని ఒక్కో మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు జరుపుతారు.