ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ 2025, జనవరి 1 నుంచి తాత్కాలిక సభ్యదేశంగా చేరింది.
జపాన్ స్థానంలో పాక్‌కు తాత్కాలిక సభ్య దేశ హోదా దక్కింది. పాక్‌కు ఈ హోదా దక్కడం ఇది ఎనిమిదో సారి.
ఈ దేశంతోపాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా కొత్తగా భద్రతా మండలిలోకి వచ్చాయి.