దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో అధిక స్థాయిలో నైట్రేట్ ఉన్నట్లు ‘భూగర్భ జలాల ప్రామాణికత-2024’ వార్షిక నివేదికలో కేంద్ర భూగర్భ జలాల మండలి(సీజీడబ్ల్యూబీ) తెలిపింది.
ఈ జిల్లాల్లోని సేకరించిన 20 శాతం నీటి నమూనాల్లో నైట్రేట్ విలువ ఉండాల్సిన స్థాయి కంటే అధికంగా ఉందని తేలింది.
అలాగే 9.04 శాతం నమూనాల్లో సురక్షిత స్థాయి కంటే ఫ్లోరైడ్ ఉందని, 3.55 శాతం శాంపిళ్లలో ఆర్సెనిక్ కాలుష్యం ఉందని వివరించింది.
2023 మేలో భూగర్భ జలాల ప్రామాణికతను తెలుసుకోవడానికి మొత్తం 15,259 ప్రాంతాలను ఎంపిక చేసుకుంది.
రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులో 40 శాతం పైగా నమూనాల్లో అనుమతించిన స్థాయి కంటే నైట్రేట్ ఉండగా, మహారాష్ట్ర(35.74%), తెలంగాణ(27.48%), ఆంధ్రప్రదేశ్ (23.5%), మధ్యప్రదేశ్ (22.58%)లో భూగర్భ జలాలు అధికంగా నైట్రేట్‌తో కలుషితం అయ్యాయని పేర్కొంది.