జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ 2025, నవంబరు 20న పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై నీతీశ్, 26 మంది మంత్రులతో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. భాజపా నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది, ఎల్జేపీ నుంచి ఇద్దరు, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంల నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు.