బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లతో విజయం సాధించింది. 2025, నవంబరు 14న వెల్లడైన ఫలితాల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ 34 సీట్లు నెగ్గింది. ఎంఐఎం 5 సీట్లు గెలవగా, ఇతరులు 2 స్థానాల్లో నెగ్గారు.
జంగిల్‌రాజ్ నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తానని చెప్పి 2005లో నీతీశ్ తొలిసారి అధికారంలోకి వచ్చారు. రెండు దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ ఆయన రాజకీయంగా బలంగానే ఉన్నారు. 2005 నుంచి తీసుకొచ్చిన సుపరిపాలన, కొత్తగా చేపట్టిన అభివృద్ధి ఎజెండాను నమ్మారు. దీంతో 75ఏళ్ల నీతీశ్.. దాదాపుగా తన చివరి ఎన్నికలుగా భావిస్తున్న ఈ పోరులో ప్రభంజనం సృష్టించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.