బహుభార్యాత్వం నిషేధించే బిల్లుకు అస్సాం మంత్రివర్గం 2025, నవంబరు 9న ఆదివారం ఆమోదం తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఆరో షెడ్యూల్ ప్రాంతాలకు మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయి. బిల్లును నవంబరు 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.