Published on Feb 22, 2025
Government Jobs
బీహెచ్‌ఈఎల్-బెంగళూరులో మేనేజర్‌ పోస్టులు
బీహెచ్‌ఈఎల్-బెంగళూరులో మేనేజర్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్) మేనేజర్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20

వివరాలు:

1. సీనియర్‌ ఇంజినీర్‌-ఈ2: 13

2. డిప్యూటీ మేనేజర్‌-ఈ3: 03

3. మేనేజర్‌-ఈ4, సీనియర్‌ మేనేజర్‌-ఈ5: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ( ఎలక్ట్రికల్, మెకానికల్), ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01-02-2025 తేదీ నాటికి సీనీయర్ మేనేజర్‌కు 42 ఏళ్లు, మేనేజర్‌కు 39 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు నిండి ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ ఇంజినీర్‌కు రూ.70,000 - రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000.

దరఖాస్తు ఫీజు: రూ.400+ జీఎస్టీ.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 4 మార్చి 2025

Website:https://careers.bhel.in/index.jsp