భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) హైదరాబాద్ పార్ట్ టైమ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 18
వివరాలు:
విభాగాలు: న్యూరాలజీ, ఆంకాలజీ, కార్డియోలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్, రేడియోలజీ, సర్జరీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డీఎం, ఎండీ/ఎంస్/డీఎన్‌బీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.05.2025 తేదీ నాటికి 65 ఏళ్లు ఉండాలి.
జీతం: గంటకు రూ.500 - రూ.1000
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: సీనియర్ మేనేజర్/ హెచ్‌ఆర్-ఆర్‌ఎంఎక్స్, హెచ్‌ఆర్‌ఎం విభాగం, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, బీహెచ్‌ఈఎల్, ఆర్‌సీ పురం, హైదరాబాద్-502032.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 4 వరకు.
Website: https://careers.bhel.in/index.jsp