స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును 2024, నవంబరు 4న నియమించింది.
కార్యదర్శిగా బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.సైదులు వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీల వెనకబాటుతనం, స్వభావం, చిక్కులపై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని, రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి స్థానిక సంస్థల వారీగా దామాషా పద్ధతిలో కల్పించాల్సిన రిజర్వేషన్లను ప్రతిపాదించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని పేర్కొంది.