బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం 2026, మార్చి 15న దిల్లీలో జరిగింది. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్.. కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నాడు. బీసీసీఐ ప్రదానం చేసే అత్యున్నత అవార్డు ఇది. భారత క్రికెట్‌కు గొప్ప సేవలు చేసిన క్రికెటర్లకు దీన్ని ఇస్తారు.
స్టార్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎంపికయ్యారు. 2024-2025 సీజన్‌లో ప్రదర్శనకుగాను పురుషులు, మహిళల విభాగాల్లో గిల్, స్మృతిలకు ఈ పురస్కారం దక్కింది. ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకోవడం గిల్‌కు ఇది రెండోసారి కాగా.. స్మృతికి అయిదోసారి.