దేశ జీడీపీలో తయారీ రంగ వాటా 2047 నాటికి 25 శాతానికి చేరొచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), జడ్47 సంయుక్త నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా దాదాపు 17 శాతంగా ఉంది. 2047కు అంతర్జాతీయ పారిశ్రామికశక్తిగా భారత్ మారనుందని ఈ నివేదిక తెలిపింది. ‘డిజిటైజింగ్ మేక్ ఇన్ ఇండియా 3.0’ పేరిట ఈ నివేదిక వెలువడింది. 2047కు అయిదు (ఎలక్ట్రానిక్స్, రక్షణ, వాహన-ఈవీ, ఇంధన, ఔషధ) రంగాల్లో 25 లక్షల కోట్ల డాలర్ల (రూ.2,250 లక్షల) విలువైన పారిశ్రామిక అవకాశాలు లభిస్తాయంది.
2022లో 33 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.97 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్, 2030కు 117 బి.డాలర్ల (సుమారు రూ.10.53 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉంది.