Published on Mar 3, 2025
Current Affairs
బ్లూ ఘోస్ట్‌
బ్లూ ఘోస్ట్‌

అమెరికాలోని ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ సంస్థకు చెందిన ‘బ్లూ ఘోస్ట్‌’ వ్యోమనౌక చందమామపై  విజయవంతంగా కాలుమోపింది.

చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా.. సరైన స్థితిలో వ్యౌమనౌకను దించిన తొలి ప్రైవేట్‌ సంస్థగా అది చరిత్ర సృష్టించింది. 

చందమామ కక్ష్య నుంచి ఆటోపైలట్‌ సాయంతో బ్లూ ఘోస్ట్‌  జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో దిగింది.

ల్యాండింగ్‌ విజయవంతంగా జరిగినట్లు ఫైర్‌ఫ్లై సంస్థకు చెందిన మిషన్‌ కంట్రోల్‌ కేంద్రం ధ్రువీకరించింది.

పెద్ద శిలలు వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో అది దిగిందని పేర్కొంది.