Published on Nov 22, 2024
Government Jobs
బెల్‌ ఆప్ట్రానిక్ డివైజెస్‌లో ఇంజినీర్ పోస్టులు
బెల్‌ ఆప్ట్రానిక్ డివైజెస్‌లో ఇంజినీర్ పోస్టులు

పుణెలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- బెల్‌ ఆప్ట్రానిక్ డివైజెస్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌ఓపీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు: 

ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌: 05

మెకానికల్‌ ఇంజినీర్‌: 03

అర్హత: బీఈ (ఎలక్ట్రానిక్స్‌/ ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఈ అండ్‌ టీసీ/ మెకానికల్‌) ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01-11-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.23,500; రెండో ఏడాది రూ.25,500; మూడో ఏడాది రూ.27,500 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: పోస్టు/ కొరియర్‌ ద్వారా డిప్యూటీ మేనేజర్‌- హెచ్‌ఆర్‌ బెల్‌ ఆప్ట్రానిక్ డివైజెస్‌ లిమిటెడ్‌, ఈఎల్‌-30, జె-బ్లాక్‌, భోసారీ ఇండస్ట్రియల్‌ ఏరియా, పుణె చిరునామాకు డిసెంబరు 12 తేదీలోపు పంపించాలి.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-12-2024.

Website:https://belop-india.in/index.html