‘కబుర్ల దేవత’ పుస్తక రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌కౌశిక్ బాలసాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2025 నవంబరు 14న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2025 సంవత్సరానికి బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైన వివిధ భారతీయ భాషలకు చెందిన 24 మంది రచయితలకు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమతి, తామ్రపత్రం అందించి సత్కరించారు.
డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరుకు చెందినవారు.