బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) శాశ్వత ప్రాతిపదికన సీనియర్ ఇంజినీర్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ( సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ ఈసీఈ/ ఐటీ/ సీఎస్ఈ), ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.
దరఖాస్తు ఫీజు: రూ.708; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘అసిస్టెంట్ మేనేజర్, హెచ్ఆర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మిల్కామ్ అండ్ ఎన్డబ్ల్యూసీఎస్-ఎస్బీయూ, జళహల్లి పోస్టు, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2024.
Website:https://bel-india.in/