Published on Feb 19, 2025
Government Jobs
బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ పోస్టులు
బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌), బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 7

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.30,000 - 1,20,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-03-2025.

Website:https://bel-india.in/job-notifications/