Published on Feb 27, 2025
Government Jobs
బెల్‌లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
బెల్‌లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 10

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 1-02-2025 నాటికి 50 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19-03-2025.

Website:https://bel-india.in/job-notifications/