Published on Oct 10, 2024
Government Jobs
బెల్‌లో మేనేజర్ పోస్టులు
బెల్‌లో మేనేజర్ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్)  శాశ్వత ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివ‌రాలు:

1. అసిస్టెంట్ మేనేజర్: 06
2. ప్రొబేషనరీ ఆఫీసర్: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ / పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా (హ్యూమన్ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్ /ఇండస్ట్రియల్ రిలేషన్స్‌ / పర్సనల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు 25 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు రూ.40,000- రూ.1,40,000; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.50,000-రూ.1,60,000.

దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-10-2024.

Website:https://bel-india.in/