Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Apr 2, 2026
Government Jobs
బెల్‌లో ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజినీర్ పోస్టులు
బెల్‌లో ఫీల్డ్‌ ఆపరేషన్‌ ఇంజినీర్ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌), తన మిస్సైల్ సిస్టమ్స్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. షిల్లాంగ్, దిల్లీ, గాంధీనగర్ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల కోసం ఈ నియామకాలు జరుగుతున్నాయి.

వివరాలు:

ఫీల్డ్ ఆపరేషన్‌ ఇంజినీర్‌: 06

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 40 ఏళ్లు ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు రూ.60,000. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 15

Website:https://bel-india.in/job-notifications/