Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 11, 2026
Government Jobs
బెల్‌లో ప్రాజెక్ట్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఉద్యోగాలు
బెల్‌లో ప్రాజెక్ట్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌), నెట్‌వర్క్ అండ్‌ సైబర్ సెక్యూరిటీ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు: 

1. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ (FOE): 06 పోస్టులు.

2. ప్రాజెక్ట్ ఇంజనీర్-I: 12 పోస్టులు.

అర్హత & అనుభవం:

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో (CS/EC మొదలైనవి) బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత ఐటీ సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి.

అనుభవం: 01.02.2026 నాటికి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు 5 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 2 ఏళ్ల పారిశ్రామిక అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.02.2026 నాటికి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 32 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం & కాలపరిమితి:

గౌరవ వేతనం: ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు నెలకు రూ.60,000, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు రూ.40,000 (ప్రతి ఏటా రూ. 5,000 పెరుగుదల ఉంటుంది). అదనంగా బీమా మరియు ఇతర అలవెన్సుల కోసం ఏడాదికి రూ. 12,000 చెల్లిస్తారు.

ఒప్పంద కాలం: FOEలకు 4 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు ప్రారంభంలో 3 ఏళ్లు (మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.400 + 18% GST ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 10, 2026.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 24, 2026.

Website:https://bel-india.in/job-notifications/