భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), తన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ విభాగంలో భాగంగా కేరళలోని వివిధ ప్రాంతాల్లో పనిచేయడానికి 12 ప్రాజెక్ట్ ఇంజినీర్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 12
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 4 ఏళ్ల బిఈ/బి.టెక్/బి.ఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ సైన్స్/ఐటీ తదితర విభాగాలు) పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: ఫిబ్రవరి 1, 2026 నాటికి కనీసం రెండేళ్ల సంబంధిత పారిశ్రామిక అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2026 నాటికి గరిష్ఠంగా 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
వేతనం: ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.40,000 చొప్పున వేతనం లభిస్తుంది. ఏటా రూ.5,000 చొప్పున పెంపుతో పాటు ఇన్సూరెన్స్, ఏరియా అలవెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిని రాత పరీక్షకు (85 మార్కులు) పిలుస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ (15 మార్కులు) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 18, 2026.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9, 2026.