Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.

Published on Jun 15, 2025
Walkins
బెల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టులు
బెల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) మచిలీపట్నం ప్రాజెక్ట్‌/ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 06

2. ప్రాజెక్ట్ ఇంజినీర్‌(మెకానికల్‌): 01

3. ట్రైనీ ఇంజినీర్‌(మెకానికల్): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2025 జూన్‌ 1వ తేదీ నాటికి 32 - 37 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.40,000 - రూ.55,000, ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - రూ.40,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 28.

Website: https://bel-india.in/job-notifications/