Published on Sep 20, 2024
Government Jobs
బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు
బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్-1 (ఎలక్ట్రానిక్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 8

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 1.09.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది 50,000; నాలుగో ఏడాది 55,000 చెల్లిస్తారు.

పని ప్రదేశాలు: విశాఖపట్నం, ముంబయి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ ధ‌రఖాస్తుల‌కు చివరి తేదీ: 09-10-2024.

Website:https://bel-india.in/