Published on Oct 25, 2024
Government Jobs
బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు
బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్-1 (మెకానికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 5

వివ‌రాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 1.10.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది 50,000; నాలుగో ఏడాది 55,000 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ డీజీఎం (హెచ్‌ఆర్/సీఎస్‌జీ), భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జాలహళ్లి పోస్ట్, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2024.

Website:https://bel-india.in/