Published on Dec 17, 2025
Apprenticeship
బెల్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు
బెల్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఘజియాబాద్‌ యూనిట్‌ వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

డిప్లొమా అప్రెంటిస్‌: 90 పోస్టులు

విభాగాలు: మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్

పోస్టు పేరు - ఖాళీలు

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 2022 డిసెంబర్‌ 31వ తేదీ నాటికి అభ్యర్థులు డిప్లొమాలో ఉత్తీ్ర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31-12-2025వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

స్టైపెండ్‌: నెలకు రూ.12,500.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.  

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 30.

Website:https://bel-india.in/job-notifications/