Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 20, 2026
Government Jobs
బెల్‌లో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు
బెల్‌లో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు

పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

డిప్యూటీ మేనేజర్: 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.60,000 - రూ.1,80,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 8.

Website:https://bel-india.in/job-notifications/