ఘజియాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 77
వివరాలు:
1. ట్రైనీ ఇంజినీర్-1: 49
2. ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 28
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000; ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు రూ.150 +18% జీఎస్టీ; ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు రూ.400 +18% జీఎస్టీ.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-11-2024.
Website:https://bel-india.in/