Published on Aug 29, 2025
Government Jobs
బెల్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
బెల్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌), హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్‌-I, ప్రాజెక్ట్ ఇంజినీర్ - I పోస్టుల భర్తీకి  దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: - 80

వివరాలు:

1. ట్రైనీ ఇంజినీర్ - I - 67

2.  ప్రాజెక్ట్ ఇంజినీర్ - I - 13

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ , మెకానికల్,కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ,  సివిల్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ఆగస్టు 1, 2025 నాటికి  28 ఏళ్లు - 32 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు రూ. 30,000. - రూ.40,000. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ. 40,000 - రూ. 55,000.

దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్‌కు రూ. 177. ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.472 ఎస్సీ,ఎస్టీ,పీఢౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ  ఆధారంగా.

వేదిక: రాత పరీక్ష హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ల ఇంటర్వ్యూ హైదరాబాద్‌లోని నాచారం వద్ద గల బీఈఎల్ ఫ్యాక్టరీలో ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 12-09-2025.

Website:https://bel-india.in/job-notifications/