బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాత్కాలిక ప్రాతిపదికన కొద్వారా యూనిట్‌లో ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 51
వివరాలు:
ట్రైనీ ఇంజినీర్-1: 50
(ఎలక్ట్రానిక్స్: 30; మెకానికల్: 17; ఎలక్ట్రికల్: 01; సివిల్: 02)
ట్రైనీ ఆఫీసర్-1(ఫైనాన్స్): 01
అర్హత: ట్రైనీ ఇంజినీర్‌కు పోస్టుకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ, ట్రైనీ ఆఫీసర్‌కు ఎంబీఏ/ఎంకాం ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000.
వయోపరిమితి: 28 ఏళ్లు ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.150; ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2026.
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 25.01.2026.
ఇంటర్వ్యూ వేదిక: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కొద్వారా, పారీ గర్వాల్.
Website:https://bel-india.in/